పండుగల సీజన్‌లో చక్కెర ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోల్‌సేల్ వ్యాపారులు, డీలర్ల నిల్వల పరిమితిని 2,000 క్వింటాళ్ల నుంచి 1,000 క్వింటాళ్లకు తగ్గించింది. 15 రోజులకు మించిన నిల్వలు ఉంచకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటాయి.
చక్కెర నిల్వల పరిమితి 1,000 క్వింటాళ్లకు కుదింపు
Source: Vaartha