పాములు శీతల రక్త జీవులు కావడంతో శరీర ఉష్ణోగ్రతను సొంతంగా నియంత్రించుకోలేవు. సూర్యరశ్మి నుంచి వేడి లభించకపోతే మింగిన ఆహారం కడుపులోనే కుళ్లిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే అవి తారు రోడ్లు, బండరాళ్లపై పడుకుని వేడిని పొందుతాయి; దీన్నే బాస్కింగ్ అంటారు. చలికాలంలో పాములు చురుకుగా ఉండవు, పాముకాట్లు తక్కువ; వేసవిలో ఎక్కువ.
పాముల బలహీనత: సూర్యరశ్మి లేకపోతే ప్రాణాపాయం
Source: Asianet Telugu