ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాను భవిష్యత్తులో సంతానం కనకూడదని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని భర్త కూడా ఏకీభవించారని, భర్త తొలి వివాహ కుమార్తెను సొంత బిడ్డగా చూసుకుంటున్నానని ఆమె తెలిపారు. పిల్లలను సన్మార్గంలో పెంచే బాధ్యత తీసుకోలేనప్పుడు వారిని కనకపోవడమే శ్రేయస్కరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పిల్లలు వద్దని ప్రకటించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్
Source: Vaartha