తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం బకాయిలు చెల్లించని డిఫాల్టర్ రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. బకాయిలు ఉన్న మిల్లర్ల ఆస్తులను గుర్తించి, జప్తు చేసి, అవసరమైతే బహిరంగ వేలం వేసే ప్రక్రియపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి కేంద్రంలో అధికారులకు శిక్షణ ప్రారంభం కానుంది. నిల్వల లోటు కనిపిస్తే ఏడు రోజుల గడువుతో షోకాజ్ నోటీసులు జారీ చేసి, సరైన వివరణ ఇవ్వని వారి యంత్రాలు, వాహనాలు, బ్యాంకు ఖాతాలు, భూములు, ఇళ్లను జప్తు చేస్తారు.
బియ్యం బకాయిలు: మిల్లర్ల ఆస్తుల జప్తుకు ప్రభుత్వం సన్నాహాలు
Source: Vaartha