కరవు ప్రభావిత ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. VB-G RAM G పథకం కింద కొత్త దరఖాస్తుదారులకు 15 రోజుల్లో జాబ్‌కార్డులు అందించనున్నారు. ఇప్పటికే 18 జిల్లాల్లోని 265 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ప్రతి గ్రామంలో రోజుకు 100-150 మందికి ఉపాధి కల్పించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు 15 రోజుల్లో జాబ్‌కార్డులు
Source: Vaartha