భారీ ఎత్తున పౌరులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇది సమానత్వ హక్కు (అధికరణ 14), సార్వత్రిక వయోజన ఓటు హక్కు (అధికరణ 326)ను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. పేర్లు తొలగించే ముందు నోటీసు ఇచ్చి వాదన వినాలని ఆయన సూచించారు.
ఓటు హక్కు తొలగింపు రాజ్యాంగ విరుద్ధం: జస్టిస్ భుయాన్
Source: Vaartha