దసరా, బతుకమ్మ పండుగల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ 9 నుంచి 25 వరకు సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, హైదరాబాద్ మధ్య 34 ప్రత్యేక రైలు సర్వీసులు నడపనుంది. రైలు నంబర్ 07711 సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:10కి బయలుదేరి సాయంత్రం 5:30కి కాగజ్‌నగర్ చేరుతుంది. తిరుగు ప్రయాణం 07712 కాగజ్‌నగర్ నుంచి సాయంత్రం 6:00కి బయలుదేరి రాత్రి 11:15కి హైదరాబాద్ చేరుతుంది. ఏసీ చైర్ కార్, సెకండ్ సిట్టింగ్ కోచ్‌లతో ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దసరా, బతుకమ్మ రద్దీకి 34 ప్రత్యేక రైళ్లు
Source: Asianet Telugu