తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు 4.88 లక్షల దరఖాస్తులు

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు 4.88 లక్షల దరఖాస్తులు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా కొత్త నమోదుకు ఫారం-6 కింద 4,88,417 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 51,821 దరఖాస్తులను పరిశీలించి అర్హులను జాబితాలో చేర్చారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1,94,204 దరఖాస్తులు దాఖలు కాగా, రంగారెడ్డిలో 74,375, మేడ్చల్-మల్కాజిగిరిలో 64,863 దరఖాస్తులు వచ్చాయి. వివరాల మార్పు కోసం ఫారం-8 కింద 5,05,159 దరఖాస్తులు రాగా, పేర్ల తొలగింపు కోసం ఫారం-7 కింద 24,323 దరఖాస్తులు అందాయి.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies