రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) CEN 06/2026 నోటిఫికేషన్ ద్వారా 3,548 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు 2,750, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 371, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 300, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ 127 ఉన్నాయి. డిగ్రీ పాసైన 18-33 ఏళ్ల వారు అర్హులు; దరఖాస్తులకు నవంబర్ 6 చివరి తేదీ. ఏడో వేతన సంఘం ప్రకారం బేసిక్ పే రూ.29,200 నుంచి రూ.35,400 వరకు ఉంటుంది.
రైల్వేలో 3,548 ఉద్యోగాలు: డిగ్రీ పాసైతే చాలు
Source: Asianet Telugu