నీటి సరఫరా నిలిపివేత ప్రచారంపై జలమండలి ఖండన

నీటి సరఫరా నిలిపివేత ప్రచారంపై జలమండలి ఖండన

హైదరాబాద్‌లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశంపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ స్పష్టతనిచ్చింది. తాము అలాంటి హెచ్చరికలు లేదా ఆదేశాలు ఎలాంటివీ జారీ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. జలమండలి పేరుతో వచ్చే ధ్రువీకరించని ఫేక్ సమాచారాన్ని నమ్మవద్దని, ఫార్వార్డ్ చేయవద్దని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies