రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి ఎన్‌హెచ్-65ను మల్కాపూర్ నుంచి నందిగామ వరకు 181 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,792 కోట్లు కాగా, మచిలీపట్నం కారిడార్‌తో కలిపితే 12 వేల కోట్లు దాటుతుంది. బిఓటి పద్ధతిలో చేపట్టే ఈ పనులకు నవంబర్ 11 వరకు టెండర్ల గడువు ఉంది. భూసేకరణ అనుమతులు పూర్తవడంతో పనులు వేగవంతం కానున్నాయి.
ఎన్‌హెచ్-65 ఆరు వరుసలుగా విస్తరణ
Source: Vaartha