అయోధ్యలో ఈ నెల 5 నుంచి 8 వరకు పదో దీపోత్సవం జరగనుంది. సరయూ నది తీరంలోని 56 ఘాట్లపై 30 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది సుమారు 26 లక్షల దీపాలతో రికార్డు సృష్టించగా, ఈసారి అంతకంటే ఎక్కువ దీపాలతో కొత్త రికార్డు నెలకొల్పాలని భావిస్తున్నారు.
అయోధ్యలో పదో దీపోత్సవం: 30 లక్షల దీపాల లక్ష్యం
Source: Vaartha