యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2026 ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1,016 పోస్టుల భర్తీకి జరిగిన ఈ ప్రక్రియలో ప్రిలిమినరీలో అర్హత సాధించిన 13,343 మంది మెయిన్స్ రాశారు. వారిలో 2,526 మంది తదుపరి దశ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యారు. అభ్యర్థులు రోల్ నంబర్ ఆధారంగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడవచ్చు.
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
Source: Vaartha