వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్‌లో గురువారం పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా 6 లక్షల మందికిపైగా నిరసనల్లో పాల్గొన్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఉండగా, సీజీటీ 16 లక్షల మంది పాల్గొన్నారని పేర్కొంది. పారిస్‌లో ప్రదర్శన ప్రశాంతంగా సాగినా, పలు నగరాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుని కనీసం 448 మంది అరెస్టయ్యారు.
ఫ్రాన్స్‌లో భారీ నిరసనలు: 6 లక్షల మందికిపైగా రోడ్లపైకి
Source: Telugu Post