పాత ఢిల్లీలోని చావ్రీ బజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. శిథిలాల నుంచి ముగ్గురిని బయటకు తీశారని, వారిలో ఒకరు గాయపడ్డారని డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ తెలిపారు. ఇరుకు వీధుల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. ఘటనపై ఇద్దరు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.
పాత ఢిల్లీలో భవనం కూలి ఇద్దరు మృతి
Source: Vaartha