దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో సందేశం విడుదల చేసిన ఆయన, దీపావళి చీకటిపై వెలుగు సాధించే విజయానికి ప్రతీక అని అభివర్ణించారు. ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి ఈసారి కూడా పండుగ జరుపుకోనున్నట్లు మోదీ తెలిపారు.
దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు
Source: Vaartha