తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటనలో భాగంగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను ప్రారంభించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం స్టాళ్లను సందర్శించి రైతులు పండించిన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు. ఈ వేదిక ప్రాంతంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
కొడంగల్‌లో మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం
Source: Vaartha