ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా రాత్రిపూట బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఇళ్లు, వాణిజ్య భవనాలు దెబ్బతిని విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని కొమిషువాఖా గ్రామంలో సహాయ కేంద్రంపై గైడెడ్ బాంబు దాడిలో మృతులు 55కు చేరారు. అబుదాబిలో చర్చలకు ముందు ఒత్తిడి పెంచేందుకే మాస్కో దాడులు ముమ్మరం చేసిందని జెలెన్స్కీ ఆరోపించారు.
కీవ్‌పై రష్యా క్షిపణి దాడులు, సహాయ కేంద్రంపై దాడిలో మృతులు 55
Source: Telugu Post