జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో కనీసం 22 మంది గాయపడ్డారు. ఐచి, షిజువోకా ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉండగా, దుకాణాల అద్దాలు పగిలి ప్రజలు భవనాల నుంచి పరుగులు తీశారు. జపాన్ వాతావరణ సంస్థ తీవ్రతను 5.7గా నమోదు చేయగా, యూఎస్‌జీఎస్ 5.5గా పేర్కొంది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరోసారి బలమైన భూకంపాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
జపాన్‌లో 5.7 తీవ్రత భూకంపం.. 22 మందికి గాయాలు
Source: Telugu Post