బస్తర్ అడవుల్లో తుపాకులు పట్టిన మాజీ మహిళా మావోయిస్టులు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లో కోసా సిల్క్ దుస్తులతో ర్యాంప్ వాక్ చేశారు. ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వీరికి ముంబైకి చెందిన ప్రొఫెషనల్ ట్రైనర్ శిక్షణ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాజీ మావోయిస్టుల ఫ్యాషన్ షో వైరల్
Source: Asianet Telugu