ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తక్కువ లోతులో కేంద్రం ఉండటంతో సునామీ ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో 1-3 మీటర్ల ఎత్తు అలలు తాకే ప్రమాదం ఉందని, 300 కిలోమీటర్ల పరిధిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మలేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియాలను కూడా అప్రమత్తం చేశారు.
ఇండోనేషియాలో 7.7 తీవ్రత భూకంపం, సునామీ హెచ్చరికలు
Source: Vaartha