సంతానం కలగకపోతే మహిళలను మాత్రమే నిందించడం సరికాదని, ఇందులో 50 శాతం పురుషులూ కారణమవుతారని వైద్యులు చెబుతున్నారు. శుక్రకణాల సంఖ్య, వేగం తగ్గడం, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి మందగించడం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు, వెరికోసిల్ వంటివి ప్రధాన కారణాలు. స్మోకింగ్, మద్యపానం వంటి దురలవాట్లు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని, సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
సంతానలేమికి పురుషులూ బాధ్యులే: వైద్యులు
Source: HMTV